కరీంనగర్ జిల్లా హుజూరాబాద్‌లో రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ పర్యటించారు. హుజూరాబాద్‌లోని వ్యవసాయ మార్కెట్లో వరి ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభోత్సవానికి వెళ్తుండగా.. మంత్రి కాన్వాయ్‌ను ఏబీవీపీ కార్యకర్తలు అడ్డుకున్నారు.
మంత్రి ఈటల కాన్వాయ్‌ను అడ్డుకున్న ఏబీవీపీ కార్యకర్తలు - minister etela
కరీంనగర్ జిల్లా హుజూరాబాద్‌లో వైద్య,ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ కాన్వాయ్‌ను ఏబీవీపీ కార్యకర్తలు అడ్డుకున్నారు. వ్యవసాయ మార్కెట్లో వరి ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభోత్సవానికి వెళ్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది.
![మంత్రి ఈటల కాన్వాయ్‌ను అడ్డుకున్న ఏబీవీపీ కార్యకర్తలు minister etela, telangana health minister, minister etela rajender](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-11423379-889-11423379-1618559820635.jpg)
మంత్రి ఈటల, ఆరోగ్య మంత్రి ఈటల, ఈటల రాజేందర్, హుజూరాబాద్‌లో మంత్రి ఈటల
కరీంనగర్-వరంగల్ జాతీయ రహదారిపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. నిరుద్యోగ యువతకు నిరుద్యోగ భృతి చెల్లించాలని డిమాండ్ చేశారు. ఉద్యోగ నోటిఫికేషన్‌ను వెంటనే విడుదల చేయాలని కోరారు.
మంత్రి ఈటల కాన్వాయ్ అడ్డగింత
ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కార్యకర్తలను అడ్డుకోవడం వల్ల తోపులాట జరిగింది. ఈ క్రమంలో ఇద్దరు యువకులు స్వల్పంగా గాయపడ్డారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఏబీవీపీ కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.