కరీంనగర్ జిల్లా గంగాధర ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో అనారోగ్య పీడితులు నిత్యం వరుస కడుతున్నారు. కరోనా వైరస్ వ్యాపిస్తుండటం వల్ల అక్కడికి చేరుకున్న వారంతా భౌతిక దూరం పాటించేందుకు ఆధార్ కార్డులను ఉపయోగిస్తున్నారు. ఎరువుల కోసం, తమ పట్టా పుస్తకాల కోసం రైతులు చెప్పులు పెట్టిన ఉదంతాలున్నాయి. ఇపుడు అనారోగ్య పీడితులు అదే తరహాలో ఆధార్ కార్డులను వరుసలో పెట్టి వైద్య సహాయం పొందుతున్నారు.
భౌతికదూరం పాటించేందుకు ఆధార్‌కార్డులను వినియోగిస్తున్నారు! - karimnagar district news
కరోనా వైరస్ వ్యాపిస్తున్న తరుణంలో అధికారులు గ్రామాల్లో ఆర్ఎంపీ వైద్యులను కట్టడి చేశారు. దీంతో అనారోగ్యంతో బాధపడే వారు నేరుగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు వెళ్తున్నారు. కానీ వైరస్ వ్యాప్తి రోజురోజుకూ పెరుగుతున్న తరుణంలో ప్రతి ఒక్కరూ భౌతిక దూరం పాటించడం తప్పనిసరి. దీనికోసం రోగులు భయంతో ఆధార్ కార్డులను వరుసలో పెట్టి వైద్య సేవలు పొందుతున్నారు.
భౌతికదూరం పాటించేందుకు ఆధార్‌కార్డులను వినియోగిస్తున్నారు!
మొదటి సారి లాక్డౌన్ విధించిన నాటి నుంచి అధికారులు గ్రామాల్లో ప్రైవేటు వైద్యులను కట్టడి చేశారు. అప్పటి నుంచి గ్రామాల్లో పూర్తిగా ప్రభుత్వ వైద్యంపై ఆధారపడుతున్నారు. దీనికి తోడు కరోనా అనుమానితులకు రాపిడ్ టెస్టులు చేస్తుండటం వల్ల ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు జనంతో కిటకిట లాడుతున్నాయి.
ఇవీ చూడండి: కేసీఆర్‌తోనే దక్షిణ తెలంగాణకు అన్యాయం: అఖిలపక్షం