తెలంగాణ

telangana

ETV Bharat / state

బట్టలు ఆరేస్తుండగా విద్యుదాఘాతం... అక్కడికక్కడే మహిళా మృతి - తీగపై అరేసే క్రమంలో విద్యుదాఘాతం

బట్టలు ఆరవేసే తీగకు విద్యుత్ సరఫరా కావడంతో ఓ మహిళ అక్కడికక్కడే మృతి చెందిన ఘటన కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండల పరిధిలో చోటు చేసుకుంది. ఇంటికే పెద్ద దిక్కుగా ఉన్న భూమాక్క మరణంతో కుటుంబంలో విషాద ఛాయలు నెలకొన్నాయి.

బట్టలు ఆరేస్తుండగా విద్యుదాఘాతం... అక్కడికక్కడే మహిళా మృతి
బట్టలు ఆరేస్తుండగా విద్యుదాఘాతం... అక్కడికక్కడే మహిళా మృతి

By

Published : Aug 21, 2020, 3:39 PM IST

కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలం చిన్న ముల్కనూరు గ్రామంలో బట్టలు ఆరేస్తుండగా ప్రమాదవశాత్తు విద్యుదాఘాతంతో మహిళా అక్కడికక్కడే మృతిచెందింది. బట్టలు ఆరవేసే తీగకు విద్యుత్ సరఫరా కావడంతో కరెంట్ షాక్​తో పెసరి భూమక్క మరణించింది.

భారీ వర్షాలకు...

మృతురాలి ఇంటి సమీపంలోని బావి వద్ద ఉన్న విద్యుత్ లైన్ పై భారీ వర్షాల కారణంగా చెట్టు కొమ్మ రాపిడి జరిగింది. అది కాస్త భూమక్క నివాసముంటున్న రేకుల షెడ్​కి ఆనుకుంది.

గమనించని భూమక్క...

ఈ విషయం గమనించని భూమక్క ఉదయం స్నానం చేసి బట్టలు.. తీగపై అరేసే క్రమంలో రేకుల షెడ్​కు ఆనుకుని ఉన్న తీగకు విద్యుత్ ప్రసరణ జరగడంతో విద్యుత్ షాక్​కు గురై మృతి చెందింది. దురదృష్టకరమైన ఈ సంఘటనతో మృతురాలి కుటుంబంలో విషాదం చోటు చేసుకుంది.

భర్త, ఇద్దరు కుమారులు, కుమార్తె...

మృతురాలుకు భర్త, ఇద్దరు కుమారులు, కుమార్తె ఉన్నారు. గ్రామంలో వ్యవసాయ పనులు చేసుకుంటూ జీవిస్తున్నారు. ఇంట్లో పెద్ద దిక్కుగా ఉన్న భూమాక్క మరణంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు.

ఇవీ చూడండి : సీమ ఎత్తిపోతలపై తెలంగాణ వాదనలు వినేందుకు ఎన్జీటీ అంగీకారం

ABOUT THE AUTHOR

...view details