కాన్పు కోసం కరీంనగర్ ఆస్పత్రికి తరలిస్తుండగా అంబులెన్స్‌లోనే ఓ మహిళ ప్రసవించింది. కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలం బొమ్మనపల్లి గ్రామానికి చెందిన జ్యోతిని 108 వాహనంలో ఆస్పత్రికి తీసుకెళ్తుండగా పురిటి నొప్పులు ఎక్కువయ్యాయి. ఎమర్జెన్సీ మెడికల్ టెక్నీషియన్ విద్యాసాగర్, పైలట్ వెంకటేశ్వర రెడ్డి సాయంతో అంబులెన్స్‌లోనే ఆమెకు సోమవారం రాత్రి కాన్పు చేశారు. ఆమె పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది.
అంబులెన్స్‌లో ప్రసవం... తల్లీబిడ్డా క్షేమం
ఆస్పత్రికి తీసుకెళ్తుండగా ఓ మహిళ అంబులెన్స్‌లోనే పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. 108 వాహన సిబ్బంది ఆమెకు ప్రసవం చేశారు. తల్లీబిడ్డా క్షేమంగా ఉన్నారని తెలిపారు.
అంబులెన్స్‌లో ప్రసవం... తల్లీబిడ్డా క్షేమం
తల్లి, బిడ్డా క్షేమంగా ఉన్నారని... ఇద్దరినీ కరీంనగర్ ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్పించినట్లు వారి కుటుంబ సభ్యులు తెలిపారు. కాన్పు చేసిన సిబ్బందిని సూపర్వైజర్ బోయిని సంపత్, తోటి ఉద్యోగులు అభినందించారు.