తెలంగాణ

telangana

ETV Bharat / state

ఈ నెల 22న కార్మికుల దేశవ్యాప్త సమ్మె - A nationwide strike by workers on the 22nd of this month

కార్మిక చట్టాల రద్దును నిరసిస్తూ కరీంనగర్​లో సీఐటీయూ ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. కార్మికులకు మార్చి, ఏప్రిల్​ నెల జీతాలు కూడా యాజమాన్యాలు చెల్లించలేదని పేర్కొన్నారు. ఈ నెల 22న దేశవ్యాప్త సమ్మెకు కార్మిక సంఘాలు పిలుపునిచ్చినట్లు వెల్లడించారు.

A protest event in Karimnagar under the auspices of CITU
ఈ నెల 22న కార్మికుల దేశవ్యాప్త సమ్మె

By

Published : May 18, 2020, 4:16 PM IST

కార్మిక చట్టాలను రద్దు చేసి, పని విధానం 8 నుంచి 12 గంటలకు పెంచడాని నిరసిస్తూ సీఐటీయూ ఆధ్వర్యంలో కరీంనగర్​ జిల్లా కార్యాలయంలో నిరసన చేపట్టారు. లాక్​డౌన్​ సమయంలో కార్మికులకు పూర్తి స్థాయిలో వేతనాలు ఇస్తామని చెప్పిన ముఖ్యమంత్రి కేసీఆర్​ ఇప్పుడు బోసస్​, డీఏ, ఇతర అలవెన్సులు కట్​ చేసుకోవడం ఏంటని ప్రశ్నించారు. రాష్ట్రంలో కార్మిక వ్యతిరేక చర్యలు నడుస్తున్నాయని విమర్శించారు.

జిల్లాలోని అనేక రకాల కార్మికులకు మార్చి, ఏప్రిల్ నెల వేతనాలు కూడా యాజమాన్యాలు ఇవ్వలేదని తెలిపారు. అందుకే ఈ నెల 22న దేశ వ్యాప్తంగా అన్ని కార్మిక సంఘాలు సమ్మెకు పిలుపునిచ్చినట్లు వెల్లడించారు. ఈ సమ్మెలో ప్రతి కార్మికుడు పాల్గొన్నాలని సూచించారు. కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా సహాయ కార్యదర్శి పున్నం రవి, జిల్లా నాయకులు సలీమ్, కిషన్, అంజయ్య, మల్లేశం, ముసయ్య, మహేందర్ రెడ్డి తదతరులు పాల్గొన్నారు.

ABOUT THE AUTHOR

...view details