నేతలపై ఇష్టం ఉంటే వారి పేర్లను పచ్చ బొట్టు పొడిపించుకుంటారు. మరి ఎక్కువ అభిమానం ఉంటే వారి పిల్లలకు నేతల పేర్లు పెడతారు. కానీ కరీంనగర్ జిల్లా రామడుగు మండలం చిప్పకుర్తిలో ఓ వ్యక్తి తన ఇంటిపై దేశ ప్రధాని నరేంద్ర మోదీ చిత్రాన్ని శాశ్వతంగా ఉండే విధంగా గీసుకున్నారు. భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ స్వయంగా వెళ్లి ఆ ఇంటిని సందర్శించారు.
ప్రధాని మోదీపై అభిమానాన్ని చాటిన వ్యక్తి - బండి సంజయ్ లేటెస్ట్ వార్తలు
సాధారణంగా ఇంటిపై దేవుడి బొమ్మ పెట్టుకుంటాం. కానీ ఓ వ్యక్తి ప్రధానిపై ఉన్న అభిమానంతో ఇంటిపై మోదీ ఫొటో పెట్టుకున్నాడు. ఆ అభిమాని భక్తికి మెచ్చిన భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆ ఇంటిని సందర్శించారు.
ఇంటిపై మోదీ ఫొటో
ఇంటి యజమాని బాలుసాని మహేశ్‌ను అభినందించారు. ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వానికి అన్ని వర్గాల ప్రజలు మద్దతు పలుకుతున్నారని అన్నారు. అనంతరం రామడుగు, చొప్పదండి మండలాల్లో రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన వారి కుటుంబాలను పరామర్శించారు.
ఇదీ చదవండి:కమ్యూనిస్టు పార్టీలకు లేఖలు రాసిన రాష్ట్ర కాంగ్రెస్