కరీంనగర్‌కు చెందిన ఘనశ్యామ్ ఓజా అనే వ్యక్తి వ్యాక్సిన్ వేసుకోవడానికి ఆన్లైన్లో స్లాట్ బుక్ చేసుకున్నారు. 12 తేదీ మధ్యాహ్నం 12 గంటల నుంచి 2 గంటల మధ్య టీకా వేయించుకోవడానికి రావాలని చరవాణికి సందేశం వచ్చింది. అదే సమయానికి ఘనశ్యామ్ ఓజా ఆస్పత్రికి వెళ్లారు.
వ్యాక్సిన్ వేసుకోకున్నా.. వేసుకున్నట్లు సందేశం - కొవిడ్ వ్యాక్సిన్ వార్తలు
కొవిడ్ వ్యాక్సిన్ వేసుకోవడానికి వెళ్లిన ఓ వ్యక్తికి వింత అనుభవం ఎదురైంది. వ్యాక్సిన్ వేసుకోకున్నా.. వేసుకున్నట్లు చరవాణికి సందేశం వచ్చింది. ఈ ఘటన కరీంనగర్లో జరిగింది.
వ్యాక్సిన్, టీకా
కానీ... అప్పటికే వ్యాక్సిన్ వేసుకున్నట్లు మొబైల్‌కు మెసేజ్ వచ్చింది. ఈ సందేశంతో అవాక్కైన ఘనశ్యామ్ ఆస్పత్రి సిబ్బందిని ప్రశ్నించారు. తన ఆధార్ కార్డుతో పాటు మొబైల్ వినియోగించి టీకా తీసుకున్న వారితో పాటు సహకరించిన వారిపై చర్య తీసుకోవాలని ఘనశ్యామ్ ఓజా డిమాండ్ చేశారు.
ఇదీ చదవండి:రాష్ట్రంలో మరో 3,052 కరోనా కేసులు, 7 మరణాలు