తెలంగాణ

telangana

ETV Bharat / state

తహసీల్దార్‌ కార్యాలయ సిబ్బందిపై మరో 'పెట్రో' దాడి - revenue news

పెట్రోల్​తో అబ్దుల్లాపూర్​మెట్ తహసీల్దార్​ను సజీవదహనం చేసిన ఘటనను మరువకముందే అదే తరహాలో మరో ఘటన చోటుచేసుకుంది. కరీంనగర్‌ జిల్లాలోని చిగురుమామిడి తహసీల్దార్‌ కార్యాలయ సిబ్బందిపై ఓ రైతు పెట్రోల్‌ చల్లడం కలకలం రేపింది.

తహసీల్దార్‌ కార్యాలయ సిబ్బందిపై మరో 'పెట్రో' దాడి

By

Published : Nov 19, 2019, 1:34 PM IST

Updated : Nov 19, 2019, 4:02 PM IST

కరీంనగర్‌ జిల్లాలో దారుణం జరిగింది. చిగురుమామిడి తహసీల్దార్‌ కార్యాలయ సిబ్బందిపై ఓ రైతు పెట్రోల్‌ చల్లాడు. సీనియర్‌ అసిస్టెంట్‌ రామచందర్‌, వీఆర్వో అనిత, కంప్యూటర్​ ఆపరేటర్ జగదీష్​, అటెండర్‌ దివ్యపై పెట్రోల్​ దాడి చేశాడు.

అన్నదమ్ముల మధ్య భూవివాదం...

లంబడిపల్లెకు చెందిన కనకయ్య తన భూమికి పట్టా చేయాలని కొంతకాలంగా రెవెన్యూ అధికారుల చుట్టూ తిరుగుతున్నాడు. కాలయాపన జరగడంతో ఆగ్రహించి పెట్రోల్ దాడికి పాల్పడినట్లు తెలుస్తోంది. కాగా... అన్నదమ్ముల మధ్య భూవివాదం కారణంగానే పట్టా చేయడం లేదని రెవెన్యూ సిబ్బంది చెబుతున్నారు.

క్రిమినల్ కేసులు తప్పవు...

రెవెన్యూ సిబ్బందిపై కనకయ్య పెట్రోల్ చల్లిన విషయాన్ని కలెక్టర్ సర్ఫరాజ్‌ అహ్మద్​కు జాయింట్‌ కలెక్టర్‌ శ్యామ్‌ప్రసాద్‌లాల్‌ తెలిపారు. వెంటనే అతనిపై క్రిమినల్‌ కేసు నమోదయ్యేలా చూడాలని కలెక్టర్ ఆదేశించారు. రైతు కనకయ్యను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

తహసీల్దార్‌ కార్యాలయ సిబ్బందిపై మరో 'పెట్రో' దాడి

ఇవీ చూడండి: కామారెడ్డిలో హమాలీ దారుణ హత్య

Last Updated : Nov 19, 2019, 4:02 PM IST

ABOUT THE AUTHOR

...view details