కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలంలోని అలుగునూర్ కాకతీయ కాలువ వద్ద ప్రమాదం చోటు చేసుకుంది. కరీంనగర్ నుంచి ద్విచక్ర వాహనంతో గన్నేరువరం వెళ్తోన్న దంపతులు ప్రమాదవశాత్తు కాల్వలో పడిపోయారు. రాత్రివేళ ద్విచక్ర వాహనాన్ని నడిపిస్తున్న ప్రదీప్‌కు పురుగులు కళ్లలో పడటం వల్ల ఈ ప్రమాదం చోటు చేసుకుంది. అదే సమయంలో దారి గుండా వెళ్తూ... పెట్రోలింగ్ నిర్వహిస్తున్న బ్లూ కోట్ పోలీసులు వీరిని గమనించి సహాయక చర్యలు చేపట్టారు.
కాల్వలోకి ద్విచక్ర వాహనం... గల్లంతైన భార్య
కరీంనగర్ జిల్లాలోని కాకతీయ కాలువలో ప్రమాదవ శాత్తు భార్య భర్తలు పడిపోయారు. గమనించిన బ్లూ కోట్ పోలీసులు భర్తను రక్షించి ఆసుపత్రికి తరలించారు. బాధితుడి భార్యతో సహా వాహనం గల్లంతయ్యింది. పోలీసులు గాలింపు చర్యలు చేపడుతున్నారు.
కాకతీయ కాల్వలోకి దూసుకెళ్లిన దంపతుల ద్విచక్ర వాహనం
అనంతరం తాడు సహాయంతో ప్రదీప్‌ను గట్టుకు చేర్చారు. ద్విచక్ర వాహనం సహా అతని భార్య జాడ తెలియరాలేదు. అపస్మారక స్థితిలోకి వెళ్లిన క్షతగాత్రుడిని కరీంనగర్ ఆసుపత్రికి తరలించారు. ఘటనా స్థలంలో లభ్యమైన ఆధార్ కార్డు ఆధారంగా వారు గన్నేరువరానికి చెందిన వారిగా పోలీసులు గుర్తించారు.
ఇవీ చూడండి : డివైడర్‌ను ఢీకొన్న తుపాను వాహనం.. ముగ్గురు మృతి
TAGGED:
KAKATEEYA KALUVA PRAMADAM