తెలంగాణ

telangana

By

Published : Sep 16, 2020, 8:44 AM IST

Updated : Sep 16, 2020, 9:23 AM IST

ETV Bharat / state

మొక్కల పుట్టినరోజు వేడుకలు చూదము రారండి..

చెట్టును చూస్తే కొందరికి మాను కనిపిస్తే... మరికొందరికి ప్రాణం కనిపిస్తుంది. కానీ ఓ వ్యక్తి ఆ మొక్కల్లో తన కుమార్తెలను చూసుకుంటున్నాడు. రెండు మొక్కలను తన పిల్లలుగా భావించి పుట్టినరోజు వేడుకలు ఘనంగా చేశాడు. ఈ ఘటన కరీంనగర్​ జిల్లా రేకుర్తిలో జరిగింది.

Mokkala
Mokkala

కరీంనగర్‌లో ఓ కార్పొరేటర్‌ రెండు చెట్లను తన పిల్లలుగా పరిగణిస్తూ పుట్టిన రోజును అట్టహాసంగా నిర్వహించారు.ఇద్దరు మగపిల్లలు పుట్టగా తనకు ఆడపిల్లలు లేని లోటును మొక్కల్లో చూసుకుంటున్నాని తెలిపారు. రేకుర్తిలో నిర్వహించిన పుట్టిన రోజు వేడుకలకు మేయర్ సునీల్‌రావు హాజరై కేక్ కట్ చేశారు.

వాతావరణ సమతౌల్యంలో గణనీయమైన మార్పు వస్తున్న తరుణంలో మొక్కలు పెంచడం ఎంతో అవసరమని మేయర్‌ పేర్కొన్నారు. మొక్కల పెంపకం యజ్ఞంలా కొనసాగవల్సిన అవసరం ఉందన్నారు. కార్పొరేటర్ ఏదుల రాజశేఖర్​ మొక్కల పట్ల అవలంభిస్తున్న తీరు ఆదర్శనీయమని పేర్కొన్నారు. ఈ సందర్భంగా తాను పెంచుకున్న మొక్కలకు ఏదుల హరిత, ఏదుల పల్లవి అని నామకరణం చేయగా... మొదటి పుట్టిన రోజును అట్టహాసంగా జరుపుకుంటున్నట్లు తెలిపారు.

ఇదీ చూడండి:దేశంలో అత్యుత్తమ‌ న‌గ‌రంగా హైద‌రాబాద్

Last Updated : Sep 16, 2020, 9:23 AM IST

ABOUT THE AUTHOR

...view details