కాళేశ్వరం ప్రాజెక్టులోని గాయత్రి పంప్‌హౌస్‌లోని మూడో పంపు వెట్‌రన్ విజయవంతమైంది. ఆగస్టు నెల నుంచి ఇప్పటి వరకు మొత్తం ఆరు పంపులతో ఎత్తిపోతల చేపట్టారు. 139 మెగావాట్ల సామర్థ్యం గల పంపు సెట్లతో నిత్యం 2టీఎంసీల జలాలను ఎగువకు తరలించేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. కరీంనగర్ జిల్లా రామడుగు మండలం లక్ష్మీపూర్‌లో గల గాయత్రి పంప్‌హౌస్ నుంచి ఇప్పటివరకు మాధ్యమానేరు ప్రాజెక్టుతో పాటు శ్రీరాంసాగర్ పునరుజ్జీవ పథకానికి నీటిని తరలించారు. తాజాగా మూడో పంపు వెట్‌రన్ నిర్వహించగా... ఇంకా ఏడో పంపునకు వెట్‌రన్ నిర్వహించాల్సి ఉంది.
గాయత్రి పంప్‌హౌస్ మూడో పంపు వెట్‌రన్ విజయవంతం - లక్మీపూర్లో గాయత్రి పంప్‌హౌస్
కరీంనగర్ జిల్లా రామడుగు మండలం లక్ష్మీపూర్‌లో గాయత్రి పంప్‌హౌస్‌లోని మూడో పంపు వెట్‌రన్ విజయవంతమైంది. ఈ వెట్‌రన్‌తో ఇప్పటి వరకు ఆరు పంపులను పరీక్షించినట్లైంది. ఏడో పంపును పరీక్షించినట్లైతే... అన్ని పంపులు సిద్ధమైనట్లే.!
6TH PUMP WET RUN SUCCEEDED GAYATHRI PUMP HOUSE