ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదిన వేడుకలను కరీంనగర్ జిల్లా హుజూరాబాద్‌లో తెరాస నాయకులు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ హాజరయ్యారు. అంబేడ్కర్ ప్రధాన కూడలి వద్ద మొక్కలు నాటారు.
సీఎం పుట్టిన రోజు వేడుకల్లో 66 కేజీల భారీ కేక్ - కరీంనగర్ తాజా వార్త
సీఎం కేసీఆర్ పుట్టినరోజు సందర్భంగా కరీంనగర్ హుజూరాబాద్‌లో మంత్రి ఈటల 66 కేజీల భారీ కేక్‌ను కట్‌చేసి మిఠాయిలు పంచారు. పట్టణంలో మొక్కలు నాటి.. నిరుపేదలకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.
సీఎం పుట్టిన రోజు వేడుకల్లో 66 కేజీల భారీ కేక్
మత పెద్దలచే సర్వమత ప్రార్ధనలు జరిపారు. అనంతరం తెరాస రాష్ట్ర సహయ కార్యదర్శి బండ శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన 66 కేజీల భారీ కేక్‌ను మంత్రి కట్‌చేశారు. కేసీఆర్ నాయకత్వం వర్థిల్లాలి అంటూ నినాదాలు చేశారు. నిరుపేదలకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. సీఎం కేసీఆర్ ప్రజల సంక్షేమం కోసం నిర్విరామంగా పని చేస్తున్నారని మంత్రి ఈటల అన్నారు.
ఇదీ చూడండి:కేసీఆర్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన కేటీఆర్, హరీశ్