తెలంగాణ

telangana

ETV Bharat / state

మొక్కవోని సంకల్పం... తల వంచిన వైకల్యం - కరీంనగర్​ జిల్లా తాజా వార్తలు

పేదరికం చుట్టుముట్టినా... వైకల్యం నడవలేకుండా చేసినా.. ఏనాడు కలత చెందలేదు. రెక్కాడితే గాని డొక్కాడని పరిస్థితుల్లో కన్నీళ్లను దిగమింగుతూ మనో ధైర్యంతో జీవిస్తున్నాడు. ఆకలి పోరాటంలో వైకల్యం ఏపాటిదంటూ నిత్యం పనికి పోతూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. ఆరుపదుల వయస్సులోను ఏదో పనిచేస్తూ ఎందరికో ఆదర్శంగా నిలుస్తున్నాడు కరీంనగర్​ జిల్లా జంగంపల్లికి చెందిన కొమురయ్య.

disabled  old man struggled financial problem
మొక్కవోని సంకల్పం... తల వంచిన వైకల్యం

By

Published : Jul 15, 2020, 2:17 PM IST

విధి ఆయన్ని వికలాంగుడిని చేసింది. కష్టాలు చుట్టాల్లా చుట్టుముట్టాయి. అయితేనేమి సంకల్పం ముందు వైకల్యం తలవంచింది. 40 ఏళ్ల వయస్సులో కాలు కోల్పోయినా... ఆరు పదుల వయసులో జీవితాన్ని ఆత్మస్థైర్యంతో నెట్టుకొస్తున్నాడు కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలం జంగంపల్లికి హనుమాండ్ల కొమురయ్య.

మొక్కవోని సంకల్పం... తల వంచిన వైకల్యం

గ్రామానికి చెందిన హనుమాండ్ల కొమురయ్యకు 20 ఏళ్ల క్రితం ప్రమాదవశాత్తు కుడికాలు కోల్పోయాడు. నలుగురు కుమార్తెలు, ఓ కుమారుడు ఉన్న కొమరయ్యది రెక్కాడితే గాని డొక్కాడని పరిస్థితి. ఆర్థిక ఇబ్బందులు వెంటాడినా... కుటుంబ పోషణలో ఇబ్బందులు ఎదురైనా... కష్టాలకు ఎదురీదుతూ పిల్లలకు పెళ్లిళ్లు చేశాడు. వృద్ధాప్యంలోను ఒంటికాలితోనే సైకిల్​ తొక్కుకుంటూ ఉపాధిహామీ పనులుచేస్తున్నాడు.

సదరం కోసం అవస్థలు

తన సదరం సర్టిఫికెట్​ను ఐదేళ్ల క్రితం ఓ వ్యక్తి తీసుకున్నాడని.. అప్పటి నుంచి ధ్రువపత్రం లేక ఎటువంటి లబ్ధి పొందలేక పోతున్నానని వాపోతున్నాడు. తిరిగి నూతన ధ్రువపత్రం ఇప్పించాల్సిందిగా అధికారులను కోరుతున్నాడు. పనికోసం వెతుక్కుంటూ... ఖాళీ సమయంలో పర్యావరణ పరిరక్షణలో తనవంతు బాధ్యతగా మొక్కలు నాటుతున్నారు. గ్రామీణ ఉపాధి హామీ పనుల్లో భాగంగా ఎక్కువ రోజులు పని కల్పించాలని ప్రభుత్వాన్ని ప్రాధేయ పడుతున్నాడు.

ఇదీ చూడండి:హరితహారంలో భాగంగా మొక్కలు నాటిన ఎస్పీ రాహుల్

ABOUT THE AUTHOR

...view details