కరీంనగర్ జిల్లా కేశవపట్నంలో ప్రాణాంతక ఘటన చోటుచేసుకుంది. ఓ అయిదేళ్ల బాలుడు స్టీల్ బిందెతో ఆడుకుంటుండగా... తల బిందెలో ఇరుక్కుపోయింది. ఎంత ప్రయత్నించినా బాలుడి తల బయటకు రాకపోవడంతో తల్లిదండ్రులు ఆందోళన చెందారు. ఆ బిందెను తొలగించెందుకు విశ్వప్రయత్నం చేశారు. ఓవైపు చిన్నారి ఏడుపు... మరోవైపు తీసేందుకు ఎంత ప్రయత్నించినా.. రాకపోవడం... తల్లిదండ్రులు తీవ్ర భయానికి గురయ్యారు.
బిందెలో ఇరుక్కుపోయిన బాలుడి తల.. నొప్పికి విలవిల - karimnagar district latest news
ఓ 5 ఏళ్ల బాలుడు.. బిందెతో ఆడుకుంటున్నాడు. ఇంతలో స్టీల్ బిందెలో తల ఇరుక్కుపోయింది. ఎంత ప్రయత్నించినా... ఆ బిందె నుంచి తల బయటకు రాలేదు. దీనితో ఏం చేశారంటే..?

head struck in steel pot
బిందెలో తల ఇరుక్కుపోయి.. విలవిలాడిన బాలుడు!!
అన్ని యత్నాల అనంతరం స్టీల్‌ను కత్తిరించే యత్నంతో బిందెను తొలగించారు. బిందెను కత్తిరిస్తున్న క్రమంలో కళ్లలో ముక్కలు పడకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. దాదాపు రెండు గంటల పాటు కష్టపడి.. బిందెను కత్తిరించడంతో తల్లిదండ్రులు ఊపిరి పీల్చుకున్నారు.
ఇదీ చదవండి: ఇంటింటి సర్వేలో వెలుగులోకి వచ్చిన కరోనా బాధితులు
Last Updated : May 13, 2021, 10:27 AM IST