భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలానికి చెందిన దంపతులు ఐదు పదుల వయస్సులోను పండంటి కవలలకు జన్మనిచ్చారు. వ్యాపారంలో స్థిరపడిన ఆరె సత్యనారాయణ-రమాదేవి దంపతులకు ఓ కుమారుడు, కుమార్తె ఉన్నారు. అయితే రోడ్డు ప్రమాదంలో తన కొడుకును పోగుట్టుకున్న ఆ దంపతులు కుమార్తె వివాహం అనంతరం వారసుని కోసం ప్రయత్నాలు మొదలుపెట్టారు. 55 ఏళ్ల వయస్సులో ఉన్న ఆరె సత్యనారాయణ, 52 ఏళ్ల వయస్సు గల ఆయన భార్య రమాదేవి సంతానం కోసం ఎన్నో ఆసుపత్రుల చుట్టూ తిరిగారు. చివరకు కరీంనగర్‌లోని డాక్టర్ పద్మజ ఆసుపత్రికి వెళ్లారు. అదృష్టవశాత్తు 52 ఏళ్ల వయసులోనూ రమాదేవి గర్భవతి అయ్యారు. సాధారణ ప్రసవం ద్వారా ఇద్దరు ఆడశిశువులకు జన్మనిచ్చారు.రమాదేవికి రక్తపోటుతో పాటు ఇతర సమస్యలు ఉన్నప్పటికీ సాధారణ ప్రసవంలోనే ఇద్దరు ఆడశిశువులు జన్మించారని వెల్లడించారు. వయస్సు దాటిపోయిందని ఆందోళన చెందాల్సిన అవసరం లేదని డాక్టర్ పద్మజ వివరించారు.
52 ఏళ్లకు కవలలకు జన్మనిచ్చిన మహిళ - 52 ఏళ్లకు పండంటి కవలపిల్లలకు జన్మనిచ్చిన మహిళ
ఆమెకు 52 ఏళ్లు... ఇంతకు ముందే ఇద్దరు పిల్లలు పుట్టినప్పటికీ... మళ్లీ పిల్లలు కావాలనుకున్నారు. అందుకోసం ఎన్నో ఆస్పత్రుల చుట్టూ తిరిగి చివరకు ఇద్దరు పండంటి కవలపిల్లలకు జన్మనిచ్చారు.
52 ఏళ్లకు కవలలకు జన్మనిచ్చిన మహిళ