కరీంనగర్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రిలో 108 సేవలను పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ ప్రారంభించారు. ప్రమాదాల బారిన పడిన వారిని ఆస్పత్రులకు తరలించడానికి 108 వాహనాలు ఎంతగానో దోహదపడతాయని మంత్రి అన్నారు.
'కరీంనగర్లో అందుబాటులోకి కొత్తగా నాలుగు '108' వాహనాలు' - కరీంనగర్లో 4 అంబులెన్స్‌లను ప్రారంభించిన మంత్రి గంగుల
ప్రమాదాల బారిన పడినవారిని ఆస్పత్రులకు తరలించడానికి 108 వాహనాలు ఎంతగానో దోహద పడతాయని పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. ఈ మేరకు కరీంనగర్లో 4 అంబులెన్స్ వాహనాలను జెండా ఊపి ప్రారంభించారు.
'కరీంనగర్లో అందుబాటులోకి కొత్తగా నాలుగు '108' వాహనాలు'
నగరంలోని కొందరు వ్యాపారస్థులు ఉచితంగా అందించిన వాహనాల సేవలతో క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించవచ్చని తెలిపారు. ఇప్పటికే జిల్లాలో 11 వాహనాలు ఉండగా కొత్తగా ప్రారంభించిన వాటితో ఆ సంఖ్య 15కు చేరింది.
ఇదీ చదవండి:ప్రజల మన్ననలందుకుంటోన్న జమ్మికుంట ఠాణా