కరీంనగర్ జిల్లాలో కొవిడ్-19 కేసుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. గురువారం తాజాగా 32 కరోనా కేసులు నమోదయ్యాయి. ఫలితంగా మొత్తం కేసుల సంఖ్య 216కు చేరింది. ఇందులో కొంతమంది చికిత్స అనంతరం ఆసుపత్రుల నుంచి డిశ్చార్జీ కాగా.. మరికొంత మంది హోం క్వారంటైన్లో ఉంటూ చికిత్స పొందుతున్నారు.
తాజా కేసులు భగత్‌నగర్, బ్యాంకు కాలనీ, కోతిరాంపూర్, కాపువాడ, జాఫ్రీ రోడ్, సూర్యనగర్, సప్తగిరి కాలనీ, హుసేన్పురా, విద్యానగర్, వావిలాలపల్లి ప్రాంతాల్లో వెలుగు చూశాయి. ఈ నేపథ్యంలో నగరంలో నేటి నుంచి 3 రోజుల పాటు వ్యాపార సంస్థలు మూసివేయాలని నిర్ణయించారు.