హైదరాబాద్‌లో పోలీసుల కళ్లు గప్పి నుంచి తప్పించుకున్నా.. కరీంనగర్ బ్లూ కోట్ సిబ్బంది నుంచి తప్పించుకోలేక పోయాడు ఓ వ్యక్తి. సిరిసిల్లకు చెందిన సుంక వెంకటేశ్ హైదరాబాద్‌లో కూరగాయల వ్యాపారం చేస్తున్నాడు. ఈ క్రమంలో బైక్ నిబంధనలు ఉల్లంఘించినందుకు అతనికి 26 చలాన్లు వచ్చాయి.
ఒకే వాహనానికి 26 చలాన్లు - Karimnagar news today
అతడి ద్విచక్రవాహనంపై 26 చలాన్లు ఉన్నాయి. అయినా... ఎంచక్కా తప్పించుకు తిరుగుతున్నాడు. హైదరాబాద్‌లో పోలీసుల కళ్లుగప్పినా... కరీంనగర్‌లో మాత్రం దొరికిపోయాడు.
![ఒకే వాహనానికి 26 చలాన్లు bike challan checking, 26 challans for a single vehicle](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-11336633-599-11336633-1617944102101.jpg)
ఒకే వాహనానికి 26 చలాన్లతో చీటింగ్
అయినా పోలీసులకు కనిపించకుండా తిరుగుతున్నాడు. ఈ నేపథ్యంలో అతను వీణవంక పోలీసుల చేతికి చిక్కాడు. కొత్త వ్యక్తి కావడం అనుమానాస్పదంగా తిరుగుతుండటం వల్ల పోలీసులు ఆరా తీశారు. బండి నంబర్ చెక్ చేయడం వల్ల 26 చలాన్లు, రూ.8,325 జరిమానా ఉన్నట్లు తేలింది. దీంతో జరిమానా వసూలు చేసి వాహనం తిరిగి అప్పగించారు.
ఇదీ చూడండి :రాష్ట్రంలో రికార్డు స్థాయిలో కరోనా కేసులు
Last Updated : Apr 9, 2021, 11:41 AM IST