తెలంగాణ

telangana

ETV Bharat / state

ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టిన లారీ, ఇద్దరు మృతి - కరీంనగర్ జిల్లా పరిధిలో రోడ్డు ప్రమాదం

కరీంనగర్ జిల్లా పరిధిలో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. అతి వేగంగా వచ్చిన లారీ ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతి చెందారు.

ద్విచక్రవాహనాన్ని ఢీకట్టిన లారీ, ఇద్దరు మృతి

By

Published : Nov 15, 2019, 10:18 AM IST

కరీంనగర్​ జిల్లా అల్గునూర్​కు చెందిన చిందెం సాయి కిరణ్, రాంనగర్​కు చెందిన దాసరి సాయి కృష్ణ అల్గునూర్ నుంచి మానకొండూరుకు ద్విచక్రవాహనంపై బయలుదేరారు. మార్గమధ్యంలో అతివేగంగా వచ్చిన ఓ లారీ ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతి చెందారు.

స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకొన్న పోలీసులు లారీ డ్రైవర్​ను అదుపులోకి తీసుకున్నారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. ఎదిగిన బిడ్డలు రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంతో కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి.

ద్విచక్రవాహనాన్ని ఢీకట్టిన లారీ, ఇద్దరు మృతి

ఇవీ చూడండి: రాష్ట్ర వ్యాప్తంగా 15మంది అదనపు ఎస్పీల బదిలీ

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details