కరీంనగర్ జిల్లా హుజూరాబాద్‌లో ఈ నెల 22న జరిగిన చైన్ స్నాచింగ్ నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. పట్టణానికి చెందిన గోలి శారద మెడలో నుంచి ఇద్దరు దుండగులు బంగారు గొలుసు లాక్కెళ్లారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు దర్యాప్తు చేసిన పోలీసులు... సీసీ కెమెరాల్లో అనుమానాస్పదంగా తిరుగుతున్న ఇద్దరు వ్యక్తులను గుర్తించారు. నిందితులిద్దరు జమ్మికుంట మండలం వావిలాలకు చెందిన మైనర్లుగా పోలీసులు తెలిపారు.
సెల్‌పోన్ కొనుక్కోవడానికి దొంగతనం.. చివరికి జైలుకి... - chain snaching in karimnagar
చరవాణి కొనేందుకు ఇద్దురు మైనర్లు చేసిన ప్రయత్నం బెడిసి కొట్టింది. తప్పుడు దారిలో ఆలోచించి... పోలీసులకు దొరికిపోయారు. చైన్ స్నాచింగ్‌కు పాల్పడ్డ ఇద్దరు నిందితులను కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల నుంచి 40 గ్రాముల బంగారు ఆభరణాన్ని స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు.
చరవాణి కొనేందుకు చైన్‌స్నాచింగ్ చేసిన మైనర్ల అరెస్ట్
సులువుగా డబ్బులు సంపాదించి జల్సా చేసేందుకే ఈ మార్గం ఎంచుకున్నట్లు విచారణలో నిందితులు తెలిపారని ఏసీపీ శ్రీనివాసరావు వెల్లడించారు. చరవాణి కొనేందుకే చైన్‌స్నాచింగ్‌కు పాల్పడినట్లు తెలిపారన్నారు. విచారణలో సీసీ కెమెరాలు ఎంతగానో తోడ్పడుతున్నాయని ఏసీపీ శ్రీనివాసరావు తెలిపారు.