హైదరాబాద్ బోయిన్‌పల్లికి చెందిన అర్జున్(4) తన తల్లిదండ్రులతో కలిసి కరీంనగర్‌కు వెళ్లారు. బస్టాండ్‌లో రద్దీగా ఉన్న సమయంలో అర్జున్ తప్పిపోయాడు. తల్లికోసం ఏడుస్తూ తిరుగుతుండగా.. గమనించిన పోలీస్ పెట్రోలింగ్ సిబ్బంది ఆ బాబుని తీసుకుని... అతని తల్లిదండ్రుల కోసం వెతకడం ప్రారంభించారు.
తప్పిపోయిన బిడ్డను తల్లి ఒడికి చేర్చిన డయల్ 100 - telangana police
బాబు తప్పిపోయాడు. ఎంత వెతికినా దొరకలేదు. దిక్కుతోచని స్థితిలో ఆ తల్లిదండ్రులు 100కి కాల్ చేశారు. స్పందించిన పోలీసులు బిడ్డను తల్లి ఒడికి చేర్చారు. ఈ ఘటన కరీంనగర్ జిల్లాలో చోటుచేసుకుంది.
తప్పిపోయిన బిడ్డను తల్లిఒడికి చేర్చిన డయల్ 100
సుమారు అరగంట తర్వాత బాబు తల్లిదండ్రులు డయల్ 100కు కాల్ చేయగా అప్రమత్తమైన పోలీస్ కంట్రోల్‌రూమ్ సిబ్బంది రాత్రి విధుల్లో ఉన్న పెట్రోలింగ్ అధికారులకు సమాచారం ఇచ్చారు. తల్లిదండ్రులను పిలిపించి అర్జున్ను అప్పగించారు.
ఈ కథనం చదవండి: ఆపన్న హస్తం కోసం ఎదురుచూపు