MLC Nominations in karimnagar: కరీంనగర్ జిల్లాలో రెండు ఎమ్మెల్సీ స్థానాలకు మొత్తం 24 మంది నామినేషన్లు వేశారు. మిగతా జిల్లాల్లో అధికశాతం స్థానాలు ఏకగ్రీవం చేయడంలో సఫలమైన అధికార పార్టీ నాయకులు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో మాత్రం విజయం సాధించలేక పోయారు. మధ్యాహ్నం 3గంటల వరకే నామినేషన్ల ఉపసంహరణకు అవకాశం ఉండటంతో చివరి నిమిషం వరకు తమ ప్రయత్నాలను కొనసాగించారు. అందులో భాగంగా ఏకంగా 14 మంది స్వతంత్ర అభ్యర్థులు తమ నామినేషన్స్‌ను ఉపసంహరించుకున్నారు. మిగిలిన 10 మంది అభ్యర్థులు ఎన్నికల బరిలో నిలిచారు. నామినేషన్స్ విత్ డ్రా చేసుకున్న వారిలో.. పురం రాజేశం, గంగాధర శంకరయ్య, అన్నారం శ్రీనివాస్, మేకల శ్రీనివాస్, మేకల గణేష్, మొహమ్మద్ చాంద్ పాషా, పొలాస తిరుపతి, నలుమచు రామకృష్ణ, బండం వసంత రెడ్డి, ముద్దం తిరుపతి, బొమ్మెర వేణి తిరుపతి, చీకట్ల రాజశేఖర్, మాదాసు వేణు, శీలారం సత్తయ్యలు ఉన్నారు.
ఫలితాలు ఏమైనా కావొచ్చు..!
(local body mlc election) రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాలో ఏకగ్రీవంగా ఎమ్మెల్సీ స్థానాలను సొంతం చేసుకుంటున్న తెరాసకు.. కరీంనగర్ ఎమ్మెల్సీ ఎన్నికలు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నట్టు తెలుస్తోంది. ఏకగ్రీవం ఏమో కానీ ఫలితాలు తారుమారు కావొచ్చనే ఆందోళన ఆ పార్టీ నాయకులను వెంటాడుతోంది. అధికార పార్టీ నుంచి ఎల్.రమణ, టి.భానుప్రసాద్‌లు స్థానిక సంస్థల ఎన్నికల బరిలో నిలిచారు.
'అక్కడ ఓ స్థానంలో తెరాస ఓటమి ఖాయం'