తనను ప్రేమించాలంటూ పలుమార్లు యువతిని వేధించడం వల్ల మనస్తాపం చెంది శనివారం ఆమె ఒంటిపై కిరోసిన్ పోసుకొని నిప్పంటించుకున్న ఘటన కామారెడ్డి జిల్లా బాన్సువాడ మండలం సాంగోజిపేటలో చోటు చేసుకుంది. సాంగోజిపేట గ్రామానికి చెందిన గుర్జాల గంగారాం, అనీశ్వ దంపతులకు ఒక కుమార్తె , ఒక కుమారుడు ఉన్నారు. కుమార్తె ఆకాంక్ష పక్క గ్రామం కొలపూర్ ప్రభుత్వ పాఠశాలలో పదోతరగతి చదువుతోంది. సంవత్సరం నుంచి అదే గ్రామానికి చెందిన సంతోష్ గౌడ్ తనను వేధిస్తున్నాడని ఉపాధ్యాయులకు తెలుపగా వారు పలుమార్లు అతన్ని మందలించారు. అయినా సంతోష్ పెళ్లి చేసుకోవాలంటూ వేధించాడు. తల్లిదండ్రులకు చెప్పలేక... అవమానంతో శనివారం ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకుని ఆత్మహత్యకు పాల్పడింది. గమనించిన కుటుంబ సభ్యులు చికిత్స నిమిత్తం జిల్లా ప్రభుత్వాసుపత్రికి తరలించారు . ఈ రోజు ఉదయం ఆకాంక్ష మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. ఆకాంక్ష తండ్రి గంగారాం ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ప్రస్తుతం నిందితుడు సంతోష్ పరారీలో ఉన్నాడు.
వేధింపులు తాళలేక యువతి ఆత్మహత్య - వేధింపులు తాళలేక యువతి ఆత్మహత్య
ఓ యువకుడు తనను ప్రేమించాలని ఓ యువతిని వేధించడం వల్ల మనస్తాపం చెంది ఆమె శనివారం ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకుంది. ఈ రోజు ఉదయం ఆమె చికిత్స పొందుతూ మృతి చెందింది. ఆమె తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు.
వేధింపులు తాళలేక యువతి ఆత్మహత్య