కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండలంలోని భవానిపేటలో పోతురాజు వినయ్ అనే యువకుడు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. గత రెండు, మూడు రోజుల నుంచి తమ కుమారుడు ఇంటికి రాకపోవటం వల్ల కుటుంబీకులు చుట్టుపక్కలంతా వెతికారు. ఎక్కడ ఆచూకీ దొరకకపోవటం వల్ల వస్తాడులే అనుకున్నారు అంతా.
ఉరివేసుకొని యువకుడు ఆత్మహత్య - Young man commits suicide
నేటి యువత చిన్నపాటి విషయాలకే మనోవేదన చెంది బంగారం లాంటి జీవితాన్ని మొగ్గలోనే తుంచివేసుకుంటున్నారు. కామారెడ్డి జిల్లాలో పోతురాజు వినయ్ అనే యువకుడు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు.
ఉరివేసుకొని యువకుడు ఆత్మహత్య
కానీ ఈ రోజు వ్యవసాయ క్షేత్రంలోని బావిలో నుంచి కుళ్లిన వాసన రావటంతో వెళ్లి గమనించగా వినయ్ ఉరి వేసుకొని చనిపోయాడు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. యువకుడు మృతి చెందటం వల్ల కుటుంబంలో విషాద ఛాయలు నెలకొన్నాయి.