తెలంగాణ

telangana

ETV Bharat / state

జల్సాకోసం చోరీ చేశాడు.. జైలు పాలయ్యాడు - కామరెడ్జి జిల్లా ఎస్పీ శ్వేతారెడ్డి

వ్యసనాలు, జల్సాలకు అలవాటుపడ్డ ఓ యువకుడు సులభంగా డబ్బులు సంపాదించాలనుకున్నాడు. వరుస చోరీలకు పాల్పడుతూ.. పోలీసులకు అడ్డంగా దొరికి జైలు పాలయ్యాడు.

young man arrested in kamareddy was convicted of a series of thefts to make easy money
జల్సాకోసం చోరీ చేశాడు.. జైలు పాలయ్యాడు.

By

Published : Dec 22, 2020, 7:06 PM IST

జల్సాలకు అలవాటు పడి వరుస చోరీలకు పాల్పడుతున్న ఓ యువకుడిని కామారెడ్డి​ జిల్లా పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడి నుంచి రూ. 75 వేలను స్వాధీనం చేసుకున్నారు. యువకుడు నిర్మల్ జిల్లా బాసర మండలం మైలాపూర్ గ్రామానికి చెందిన వ్యక్తిగా గుర్తించినట్లు.. ఎస్పీ శ్వేతారెడ్డి తెలిపారు.

"నిందితుడు ఇటీవల జిల్లా కేంద్రంలోని 9 దుకాణాల్లో చోరీలకు పాల్పడి రూ. లక్షా 59 వేలను దొంగిలించాడు. సులభంగా సంపాదించిన డబ్బుతో జల్సా చేసేవాడు. మిగతా నగదును తల్లి దగ్గర దాచేవాడు. పరారీలో ఉన్న నిందితుడి తల్లి కోసం గాలింపు చర్యలు చేపట్టాం. ప్రజలందరూ ఇళ్లకు తాళం వేసుకున్నట్లే.. సీసీ కెమెరాలను కూడా ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం ఉంది."

- జిల్లా ఎస్పీ శ్వేతారెడ్డి.

ఇదీ చదవండి:జల్సాలకు అలవాటు పడి చోరీలు.. ఇద్దరు అరెస్ట్

ABOUT THE AUTHOR

...view details