కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండలం అన్నారం గ్రామంలో నివాసం ఉంటున్న పంగా అఖిల అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. తల్లిదండ్రులు పంగా చిన్న గంగయ్య, పోచవ్వల కుమార్తె అఖిల గురువారం సాయంత్రం ఇంటిలో నుంచి బయటకు వెళ్లి తిరిగి రాలేదు. చుట్టుపక్కల, బంధువుల ఇళ్లలో వెతికినా కనబడకపోవడం వల్ల కుటుంబ సభ్యులు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.
ప్రేమ విషయం ఇంట్లో తెలిసిందని యువతి ఆత్మహత్య - కామారెడ్డిలో యువతి ఆత్మహత్య
ప్రేమ విషయం ఇంట్లో తెలిసిందనే మనస్తాపంతో యువతి ఆనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ఘటన కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండలం అన్నారం గ్రామంలో చోటు చేసుకుంది.
ప్రేమ విషయం ఇంట్లో తెలిసిందని యువతి ఆత్మహత్య
నాలుగు రోజుల నుంచి గాలిస్తుండగా ఈ రోజు ఓ బావిలో శవమై కనిపంచిందని పోలీసుల తెలిపారు. తన ప్రేమ విషయం అబ్బాయి వాళ్ల ఇంట్లో తెలియడం వల్ల ప్రేమికుడు దూరం పెడుతున్నాడని.. ఈ విషయం అంతా తెలిస్తే అఖిలను తన తల్లిదండ్రులు తిడతారనే మనస్తాపంతో బావిలో దూకి ఆత్మహత్య చేసుకుని ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు.
ఇదీ చూడండి: రైలు ఢీకొని వ్యక్తికి తీవ్రగాయాలు
Last Updated : Dec 22, 2019, 3:54 PM IST