రోజు రోజుకూ వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరూ మాస్కు ధరించాల్సిన ఆవశ్యకత నెలకొంది. వీటిని తప్పనిసరిగా వాడాలని తాజాగా రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మాస్క్‌లు లేకుండా బయటకు వస్తే చర్యలు తీసుకొనేందుకు యంత్రాంగం సిద్ధమవుతోంది.
ఈ నేపథ్యంలో ప్రపంచ ఆరోగ్యసంస్థ మార్గదర్శకాలకు అనుగుణంగా.. వైద్యుల సూచనలు పరిగణనలోకి తీసుకొని నాణ్యమైన వస్త్రం ఉపయోగించి కామారెడ్డి జిల్లా మహిళలు వీటిని తయారు చేస్తున్నారు. వీరికి గ్రామీణాభివృద్ధి సంస్థ అధికారులు సహకారం అందిస్తున్నారు. లాక్‌డౌన్ అమలుతో వస్త్రం కొరత ఏర్పడటంతో కామారెడ్డి జిల్లా పాలనాధికారి శరత్ ప్రత్యేక చొరవ తీసుకొని వస్త్ర వ్యాపారులతో చర్చించి సమస్య పరిష్కరించారు.
ఇప్పటికే లక్షకు పైగా మాస్కులు తయారు చేసిన మహిళలు లాభాపేక్ష లేకుండా వీటిని అందజేస్తున్నారు. కేవలం తయారీ వ్యయాన్ని తీసుకొని విక్రయిస్తున్నారు. దీన్ని గమనించి పలు స్వచ్ఛంద సంస్థలు వీరికి ఆర్డర్లు ఇస్తున్నాయి. ఉపాధి గగనమైన ప్రస్తుత పరిస్థితుల్లో మాస్కుల తయారీతో వచ్చే ఆదాయమే స్వశక్తి మహిళలకు ఆధారమైంది. ఎన్ని ఆర్డర్లు వచ్చినా మాస్కులు తయారీచేసేందుకు స్వశక్తి సంఘాల మహిళలు సిద్ధంగా ఉన్నారని కామారెడ్డి జిల్లా డీఆర్‌డీవో డీపీఎం రమేష్‌బాబు చెబుతున్నారు.
సంప్రదించాల్సిన చరవాణి నంబర్లు