గెలిపిస్తే ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి 200 కోట్ల రూపాయల నిధులు తెస్తా : మదన్‌మోహన్ జహీరాబాద్‌లో తనను గెలిపిస్తే ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి 200 కోట్ల రూపాయల నిధులు తెస్తానని కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి మదన్‌మోహన్‌రావు తెలిపారు. తెరాసకు ఓటు వేస్తే మోడీకి వేసినట్టేనని పేర్కొన్నారు. రైతుల కోసం ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తానన్నారు. గెలిస్తే జహీరాబాద్‌ను మోడల్ పార్లమెంట్ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతానన్నారు. అభివృద్ధి పనులకు సంబంధించి రైల్వే డబ్లింగ్ , బోగీల సంఖ్య పెంచటం, ఫుట్ ఓవర్ బ్రిడ్జి నిర్మాణం, రిజర్వేషన్ సెంటర్, తదితర పనులు చేయిస్తానని స్పష్టం చేశారు.
ఇవీ చూడండి :వేడి రాజకీయం: చేవెళ్ల త్రిముఖ పోరులో గట్టెక్కేదెవరు