తెలంగాణ

telangana

ETV Bharat / state

అదనపు కట్నం ఇవ్వలేదని రెండో పెళ్లి.. - husband harress his wife for extra dowry

పెళ్లైన నాటి నుంచే అత్తింటి వారు అదనపు కట్నం కోసం వేధింపులకు గురిచేశారు. కట్నం తీసుకురాకపోతే వేరే పెళ్లి చేసుకుంటానంటూ భర్త బెదిరించాడు. ఇవి సరిపోవు అన్నట్లు మామ కాటేసే చూపులు. భర్తకు దూరంగా ఉంటేనైనా మారతాడు అనుకుంటే... పెళ్లి చూపులకు వెళ్తూ తనపై లేని పోని నిందలు మోపుతున్నారని ఆ భార్య వాపోయింది. తనకు న్యాయం చేయాలంటూ భర్త ఇంటి ముందు ఆందోళనకు దిగింది. ఈ ఘటన కామారెడ్డిలో చోటు చేసుకుంది.

wife-protest-infront-of-husband-house-at-kamareddy
'అదనపు కట్నం తీసుకురావట్లేదని రెండో పెళ్లి చేసుకుంటానంటున్నాడు'

By

Published : Jun 9, 2020, 5:21 PM IST

వేములవాడకు చెందిన అరుణను కామారెడ్డికి చెందిన నవీన్​కు 2017 అక్టోబర్​లో వివాహమైంది. సాఫ్ట్​వేర్ జాబ్​ చేస్తున్నాడని... 14 లక్షల నగదు, 23 తులాల బంగారం కట్నంగా ఇచ్చారు. పెళ్లైన 10 రోజుల నుంచే అరుణపై వేధింపులు మొదలయ్యాయి. మరో 15లక్షల కట్నం తీసుకురావాలని అత్తింటి వారు వేధించసాగారు.

'అదనపు కట్నం తీసుకురావట్లేదని రెండో పెళ్లి చేసుకుంటానంటున్నాడు'

''పెళ్లైన పదిరోజులకే కట్నం కోసం నన్ను వేధించడం మొదలుపెట్టారు. అత్తా మామలు, ఆడపడుచు కట్నం కోసం నన్ను హింసించేవారు. మామ సురేందర్ నన్ను లోబరుచుకునేందుకు ప్రయత్నించేవాడు. నా భర్తతో బయటకు వెళ్లనిచ్చేవాడు కాదు. ఈ కారణంగా ఏడు నెలలకే నేను నా పుట్టింటికి వెళ్లిపోయాను. మళ్లీ ఇంట్లోకి రావాలని ప్రయత్నిస్తే వాళ్లు నన్ను లోపలికి రానివ్వట్లేదు. నా భర్తకు వేరే పెళ్లి చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. పెళ్లి చూపులకు కూడా వెళ్తున్నారు. అక్కడ నాకు గర్భసంచి లేదని... అందుకే రెండో పెళ్లి చేసుకుంటున్నానని నాపై ఆరోపణలు చేస్తున్నారు.''

-అరుణ, బాధితురాలు

నాకు వారి నుంచి ప్రాణాపాయం కూడా ఉందంటూ అరుణ వాపోయింది. తన భర్త తనకు కావాలని... న్యాయం చేయాలని అత్తింటి ముందు ఆందోళనకు దిగింది.

ఇవీ చూడండి:రాష్ట్రంలో తెరుచుకోనున్న జిల్లా కోర్టులు.. ఎప్పుడంటే..?

ABOUT THE AUTHOR

...view details