తన బ్యాంకు ఖాతా నుంచి డబ్బు మాయమైందని బాధితుడు బ్యాంకు ముందు నిరసన వ్యక్తం చేశాడు. కామారెడ్డి జిల్లా మద్నూర్‌కు చెందిన నారాయణకు స్థానిక ఎస్బీఐ బ్యాంకులో ఖాతా ఉంది. పదిహేను రోజుల క్రితం తన ఖాతా నుంచి లక్షా 50 వేల రూపాయలు మాయమయ్యాయి. విషయం తెలుసుకున్న నారాయణ పోలీసులకు, బ్యాంకు అధికారులకు ఫిర్యాదు చేశాడు. అయినప్పటికీ అధికారుల నుంచి ఎలాంటి స్పందన లేదని బాధితుడు ఈ రోజు బ్యాంకు ముందు బైఠాయించాడు. తనకు న్యాయం చేయాలంటూ భార్యతో కలిసి పోరాటం చేస్తున్నాడు. బ్యాంకులో దాచుకున్న డబ్బులు ఎలా మాయమవుతాయంటూ ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఇప్పటికైనా అధికారులు స్పందించి తనకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.
ఎస్బీఐ ఖాతా నుంచి రూ.లక్షా 50 వేలు మాయం - DHARNA
ఆరుగాలం కష్టపడి సంపాదించిన డబ్బులను బ్యాంకులో దాచుకున్నాడు. ఏమైందో ఏమో తెలియదు కానీ పదిహేను రోజుల క్రితం ఖాతా నుంచి డబ్బులు మాయమయ్యాయి. ఇదేంటని అధికారలను అడిగితే స్పందన లేదు. ఏమి చేయాలో పాలుపోని బాధితుడు బ్యాంకు ముందు బైఠాయించాడు.
ఎస్బీఐ ఖాతా నుంచి రూ.లక్షా 50 వేలు మాయం