తెలంగాణ

telangana

By

Published : Nov 16, 2020, 3:45 AM IST

Updated : Nov 16, 2020, 3:55 AM IST

ETV Bharat / state

దీపావళికి రోజున మూగజీవాలకు పెళ్లి

కామారెడ్డి జిల్లా జుక్కల్‌ ప్రాంతంలో దీపావళి రోజున ఓ వింత ఆచారం కొనసాగుతోంది. ఏటా దీపావళికి అక్కడి ప్రజలు మూగజీవాలకు పెళ్లి చేస్తున్నారు. గొర్రెలకు పెళ్లి చేసి పూజలు నిర్వహిస్తున్నారు.

Wedding for sheep on the day of Diwali at kamareddy district
దీపావళికి రోజున మూగజీవాలకు పెళ్లి

దీపావళికి రోజున మూగజీవాలకు పెళ్లి

దీపావళి అనగానే టపాసులు కాల్చడం, తీపి వంటలు తినడం ఆనవాయితీ. కానీ కామారెడ్డి జిల్లా జుక్కల్లో మాత్రం ఓ వింత ఆచారం ఉంది. దీపావళి రోజున అక్కడ వయస్సుకు వచ్చిన ముగజీవాలకు పెళ్లి చేయడం అనాదిగా వస్తోంది.

మహారాష్ట్ర, కర్ణాటక సరిహద్దులో ఉండటం వల్ల... ఈ ఆచారం జుక్కల్ ప్రాంతంలోనూ కొనసాగుతోంది. గొర్రెలే జీవనాధారంగా ఉన్న కురుమలు... దీపావళికి గొర్రెల పెళ్లి తంతు నిర్వహిస్తారు. ఏడాది వయసు ఉన్న గొర్రె పిల్లలకు వివాహం జరిపించి, ప్రత్యేక పూజలు చేసి మంగళారతులు ఇస్తున్నారు.

ఇదీ చూడండి :ఖైరతాబాద్​లో ఘనంగా సదర్ ఉత్సవాలు

Last Updated : Nov 16, 2020, 3:55 AM IST

ABOUT THE AUTHOR

...view details