తెలంగాణ

telangana

ETV Bharat / state

భలే మంచి బోరు, ఇది విద్యుత్​ చార్జీలు తీసుకోదండి, ఎక్కడో చూసొద్దామా - ఉబికి వస్తోన్న నీరు

Water release from bore well వందల అడుగుల లోతులోకి బోర్లు వేసిన చుక్క నీరు కూడా రాని పరిస్థితి చూశాం. కొందరు రైతులు వ్యవసాయ భూముల్లో పదుల సంఖ్యలో బోర్లు వేసిన నీళ్లు పడని మాట విన్నాం. కానీ ఈ బోరు చూస్తే ఆశ్చర్యం కలగక మానదు. మోటరుతో పని లేకుండా బోరు నుంచి నీరు ఇలా పొంగుతూ వస్తోంది.

బలే మంచి బోరు
బలే మంచి బోరు

By

Published : Aug 27, 2022, 9:24 PM IST

Water release from bore well: బావుల్లో కనుచూపు మేర కనిపించని భూగర్భజలాలు.. నెర్రలు వారిన భూములు.. ఎండిపోయిన వాగులు.. ఇదంతా ఒకప్పటి ముచ్చట. ఇప్పుడు ఎక్కడ చూసినా జలసిరులు ఉప్పొంగుతున్నాయి. అందుకు నిదర్శనం ఈ బావి అని చెప్పొచ్చు. పాతాళగంగ పైపైకి ఉబికి వస్తూ విద్యుత్​ మోటర్​తో పనిలేకుండా ఇలా రైతన్నకు సాయపడుతోంది.

కామారెడ్డి జిల్లా మద్నూర్ మండలం కొడిచిర గ్రామంలో రైతు సాయగౌడ్ వ్యవసాయ భూమిలో ఉన్న ఈ బోరు బావి నుంచి గత కొద్ది రోజులుగా పడుతున్న వర్షాలకు నీరు ఉబికి వస్తోంది. కారణం ఏంటని ఆరాతీస్తే వర్షాలు సమృద్ధిగా కురవడంతో ఇలా బోరు నుంచి నీళ్లు ఉబికి వస్తున్నాయని రైతు చెబుతున్నారు. వర్షాలు పడి రెండు నెలలు కావస్తున్నా ఇప్పటికి బోరు నుంచి నిరంతరం నీళ్లు వస్తూనే ఉన్నాయని తెలిపారు. చుట్టూ గుట్ట ప్రాంతం ఉన్న ఇలా బోరు నుంచి నీళ్లు రావడంతో చూసిన వారంతా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details