వర్షాకాలంలోనూ తాగునీటి కష్టాలు తప్పడం లేదని కామారెడ్డి జిల్లా మద్నూర్ మండలం తడి హిప్పర్గ గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నీటి కోసం మైళ్ల దూరం వెళ్లాల్సి వచ్చినా ఎవరూ పట్టించుకోవడం లేదని వాపోతున్నారు. పార్లమెంటు ఎన్నికలు బహిష్కరిస్తామంటే కొన్ని రోజులు సరఫరా చేసి చేతులు దులుపుకున్నారని తెలిపారు. తాగునీటి కోసం 4కిలోమీటర్ల దూరం వెళ్లి వ్యవసాయ బోరు యజమానికి నెలకు 50 రూపాయలు చెల్లించి కొనుగోలు చేయాల్సి వస్తుందన్నారు.
ఎంతకష్టం: నాలుగు కిలోమీటర్లు... నెలకు రూ. 50 - kamareddy
రాష్ట్రంలో ఎక్కడ చూసినా నీటి తిప్పలే కనిపిస్తున్నాయి. వర్షాకాలంలోనూ మంచినీటి కోసం మైళ్ల దూరం వెళ్లాల్సిన దుస్థితి నెలకొంది.
నాలుగు కిలోమీటర్లు... నెలకు రూ. 50