కామారెడ్డి జిల్లా సదాశివనగర్ మండలం అడ్లూర్ ఎల్లారెడ్డి చెరువులో నీరు వృథాగా పోకుండా ఏర్పాటు చేసిన చెక్కలను గుర్తు తెలియని వ్యక్తులు తొలగించారు. అప్పటి నుంచి నీరు వృథాగా పోతూ చెరువు ఖాళీ అయిపోతోంది. ఈ చెరువు నుంచి మొత్తం ఏడు గ్రామాల వ్యవసాయ భూములకు నీరందుతోంది. గత నెల 24న చెరువులో 3 లక్షల 20 వేల చేప పిల్లలను ఎమ్మెల్యే జాజాల సురేందర్ వదిలారు. ప్రస్తుతం నీటి వృథాతో చేపలు కూడా కొట్టుకుపోయే ప్రమాదం ఉందని... అలాగే ఏడు గ్రామాల రైతన్నలకు నష్టం జరుగుతుందని స్థానిక ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు వెంటనే స్పందించి నీటిని కాపాడాలని కోరుతున్నారు.
దుండగుల పనితో చెరువు ఖాళీ.. - ఎల్లారెడ్డి చెరువులో వృథాగా పోతున్న నీరు
గత నెల 24న ఆ చెరువులో చేప పిల్లలు వదిలారు. అందులోంచి నీరు బయటకు పోకుండా చెక్కలను ఏర్పాటు చేశారు. గుర్తుతెలియని వ్యక్తులు వచ్చి ఆ చెక్కలు తీసేయడం వల్ల నీరు, చేప పిల్లలు బయటకు పోతున్నాయి.
![దుండగుల పనితో చెరువు ఖాళీ..](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-4727864-84-4727864-1570863771650.jpg)
దుండగుల పనితో చెరువు ఖాళీ..
TAGGED:
దుండగుల పనితో చెరువు ఖాళీ..