ఫౌంటెన్ కాదు... మిషన్ భగీరథ
అధికారుల నిర్లక్ష్యం... మిషన్ భగీరథ ఫౌంటెన్లా పొంగిపోయింది. భారీగా మంచి నీరు వృథా అయింది. రోడ్డు పక్కనే ఆరబెట్టిన పంట మొత్తం తడిసిపోయింది.
waste mission bagiratha water
కామారెడ్డి జిల్లా జుక్కల్ మండలం ఖండేబాల్లూర్ గ్రామ శివారులో మిషన్ భగీరథ నీరు ఎగిసిపడుతోంది. భారీగా మంచినీరు వృథా అవుతోంది. రహదారిపై ఆరబెట్టిన వరి ధాన్యం తడిసిపోవడంతో రైతులు తీవ్రంగా నష్టపోయారు. అధికారుల నిర్లక్ష్యం వల్ల భగీరథ నీటితో పంట మొత్తం తడిసిపోయిందని రైతులు వాపోయారు. నీరు వృథా అవుతోందని అధికారులకు సమాచారం అందించినా... స్పందించలేదని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. నష్టపోయిన పంటకు పరిహారం అందించాలని డిమాండ్ చేశారు.