కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి డివిజన్ కేంద్రంలోని మండల పరిషత్ కార్యాలయంలో ఉపాధి హామీ సిబ్బంది గదిలో కంప్యూటర్ ఆపరేటర్ వెనుక గల గోడ పెచ్చులు కూలాయి.
ఎంపీడీఓ ఆఫీసులో త్రుటిలో తప్పిన ప్రమాదం - kamareddy district news
కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డిలోని మండల పరిషత్ కార్యాలయంలో త్రుటిలో ప్రమాదం తప్పింది. ఉపాధి హామీ సిబ్బంది గదిలో గోడ పెచ్చులు కూలాయి. వెంటనే కంప్యూటర్ ఆపరేటర్ పక్కకు తప్పుకోవడం వల్ల ప్రమాదం తప్పింది.

త్రుటిలో తప్పిన ప్రమాదం
ఆపరేటర్ పక్కకు తప్పుకోవడం వల్ల పెద్ద ప్రమాదం తప్పింది. 1975లో నిర్మించిన భవనం పూర్తిగా శిథిలావస్థకు చేరిందని ఎంపీడీవో రాజ్వీర్ అన్నారు. నూతన భవన నిర్మాణానికై ప్రతిపాదనలు పంపుతామని పేర్కొన్నారు.
ఇవీ చూడండి:విద్యుత్ తీగలు సరిచేస్తుండగా విద్యుదాఘాతంతో రైతు మృతి