తెలంగాణ

telangana

ETV Bharat / state

సర్పంచ్ నిర్వాకం

ఎన్నికల ముందు అది చేస్తా.. ఇది చేస్తా అని వాగ్దానాలు చేశాడు. సర్పంచ్​గా గెలిచాక ఓ కాలనీ వాసులు తనకు ఓట్లేయలేదని కక్ష గట్టాడు. కాలనీకి నీటిసరఫరా నిలిపివేశాడు​. తమకు నీళ్లు కావాలని ఆ కాలనీవాసులు అధికారుల వద్ద గోడు వెళ్లబోసుకున్నారు. ఈ ఘటన కామారెడ్డి జిల్లా పెద్దశక్కర్గ గ్రామంలో జరిగింది.

By

Published : Mar 7, 2019, 6:35 PM IST

నీటి కోసం గ్రామస్థుల ధర్నా

నీటి కోసం గ్రామస్థుల ధర్నా
గ్రామ పంచాయతీ ఎన్నికల్లో తనకు ఓట్లు వేయలేదని గ్రామ సర్పంచ్ తమ కాలనీకి నీటి సరఫరా నిలిపివేశారని ఆరోపిస్తూ గ్రామస్థులు నిరసన వ్యక్తం చేశారు. కామారెడ్డి జిల్లా మద్నూర్ మండలం పెద్ద శక్కర్గ గ్రామంలోని ముదిరాజ్ కాలనీ వాసులు పంచాయతీ కార్యాలయం ముందు ధర్నా చేశారు. గ్రామ సర్పంచ్ బాబురావు కాలనీవాసులపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నాడని స్థానికులు ఎంపీడీవో విజయ్ కుమార్​కు ఫిర్యాదు చేశారు. సర్పంచ్ పై చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. కాలనీలో పెళ్లి ఉండడంతో తాగునీటి ఇబ్బందులు పడుతున్నామని అధికారితో కాలనీవాసులు గోడు వెళ్లబోసుకున్నారు.

ABOUT THE AUTHOR

...view details