కరోనాతో మృతి చెందిన వ్యక్తి అంత్యక్రియలకు కుటుంబ సభ్యులు ముందుకు రాకపోవడం వల్ల స్థానిక కౌన్సిలర్ అంత్యక్రియలు నిర్వహించాడు. కామారెడ్డి పట్టణంలోని 29వ వార్డులో ఉంటున్న రిటైర్డ్ ఏఎస్సై ఎల్లయ్య… వారం క్రితం కరోనా పాజిటివ్ వచ్చింది. అప్పటి నుంచి హోం క్వారంటైన్‌లోనే ఉంటున్నాడు. అతడి కుటుంబ సభ్యులు క్వారంటైన్‌లోనే ఉంటున్నారు.
కొవిడ్‌తో చనిపోయిన వ్యక్తికి అన్నీ తానై... - కామారెడ్డి జిల్లా వార్తలు
కరోనాతో మృతి చెందిన వ్యక్తి మృతదేహానికి స్థానిక కౌన్సిలర్ భర్త అంత్యక్రియలు నిర్వహించారు. ఈ ఘటన కామారెడ్డి పట్టణంలో జరిగింది.
died
అయితే గురువారం ఎల్లయ్య ఆరోగ్యం విషమించి ఇంట్లోనే మృతి చెందాడు. అతని అంత్యక్రియలకు కుటుంబసభ్యులు ముందుకు రాకపోవడం వల్ల స్థానిక కౌన్సిలర్ అస్మా అమ్రిద్ భర్త అంజాద్... అతని స్నేహితులతో కలిసి అంత్యక్రియలు నిర్వహించారు.