కరోనా మహమ్మారి ప్రజలను భయాందోళనకు గురిచేస్తోంది. గ్రామాల్లో వైరస్ విస్తరిస్తుండటం వల్ల గ్రామ దేవతలే కోపానికి గురవుతున్నారని ప్రజలు నమ్ముతున్నారు. ఊళ్లల్లో ముడుపులు కడుతూ గ్రామం వదిలి వనభోజనాలకు వెళ్తున్నారు.
కరోనా పోవాలంటూ ఊరంతా ఖాళీ చేశారు... - bebepet news
కరోనా మహమ్మారి ఇప్పుడు గ్రామాల్లో విజృంభిస్తోంది. ఊళ్లలోని ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. గ్రామదేవతలు కోపానికి రావటం వల్లే ఇలా జరుగుతుందని నమ్మి... ఊరంతా ఖాళీ చేశారు.
villagers went to vanabhojanalu for corona prevention in bebepet
కామారెడ్డి జిల్లా బీబీపేటలో సైతం వనభోజనాలకు వెళ్లారు. కరోనా మహమ్మారి ప్రభావం తగ్గాలని గ్రామస్థులు ముడుపు కట్టి గ్రామ శివారులో వనభోజనాలకు వెళ్లారు. గ్రామం మొత్తం నిర్మానుష్యంగా మారింది. ఊరిలో ప్రతీ ఇంటికి తాళం వేసి వనభోజనాల్లో పాల్గొన్నారు. డప్పు చప్పుళ్లతో గ్రామ దేవతలకు పూజలు నిర్వహించారు.