కామారెడ్డి జిల్లాలో రోడ్డు దుస్థితి తెలిపేందుకు మహిళలు వినూత్న రీతిలో నిరసన తెలిపారు. సదాశివనగర్ మండలం ఉత్తునూర్ గ్రామంలో బీసీ కాలనీలో మహిళలు బురదమయమైన రోడ్డుపై నాట్లు వేసి నిరసన వ్యక్తం చేశారు. అధికారులు, ప్రజాప్రతినిధులకు ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసిన ఫలితం లేకపోయిందని తెలిపారు. పైగా ప్రస్తుతం కురుస్తున్న వర్షాలతో పరిస్థితి మరింత దారుణంగా మారిందంటూ వాపోతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి సమస్యలను పరిష్కరించాలని కోరుతున్నారు.
బురదమయమైన రోడ్లపై వరినాట్లు వేసి నిరసన - బురదమయమైన రోడ్లపై వరినాట్లు వేసి నిరసన
కామారెడ్డి జిల్లా సదాశివనగర్ మండలంలోని ఉత్తునూర్ గ్రామస్థులు బురదమయమైన రోడ్లపై వరినాట్లు వేసి నిరసన తెలిపారు.

బురదమయమైన రోడ్లపై వరినాట్లు వేసి నిరసన