కామారెడ్డి జిల్లా సదాశివనగర్ మండలం దగ్గి శివారులో వలస కార్మికులతో వెళ్తున్న టాటా మ్యాజిక్ వాహనం టైర్ పేలి బోల్తా పడింది. ఈ ఘటనలో 20 మందికి తీవ్ర గాయాలు అవడం వల్ల జిల్లా ఆస్పత్రికి తరలించారు.
వలస కార్మికుల వాహనం బోల్తా..20మందికి గాయాలు, ఒకరు మృతి - కామారెడ్డి జిల్లాలో వలస కూలీ మరణం
ఛత్తీస్ గఢ్, ఝార్ఖండ్‌కు చెందిన 20 మంది కార్మికులతో వెళ్తున్న టాటా మ్యాజిగ్ టైర్ పేలి బోల్తా పడింది. ఈ ఘటనలో తీవ్ర గాయాలైన సుదేశ్వర్ రాం చికిత్స పొందుతూ మరణించాడు. ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. ఈ ఘటన కామారెడ్డి జిల్లా దగ్గి శివారులో చోటుచేసుకుంది.
కామారెడ్డి జిల్లాలో వాహనం బోల్తా.. చికిత్స పొందుతూ వలస కూలీ మరణం
వారిలో చికిత్స పొందుతూ సుదేశ్వర్ రాం (34) మృతి చెందాడు. అలాగే ముగ్గురి పరిస్థితి విషమంగా ఉండటం వల్ల మెరుగైన చికిత్స నిమిత్తం హైదరాబాద్ ఆసుపత్రికి తరలించారు. ఈ 20 మంది కార్మికులు ఛత్తీస్ గఢ్, ఝార్ఖండ్‌కు చెందినట్లుగా గుర్తించారు.
ఇదీ చదవండిఃహైదరాబాద్ను కమ్మేస్తున్న కరోనా..నగరవాసుల హైరానా..