తెలంగాణ

telangana

ETV Bharat / state

ఇంటి వద్దకే కూరగాయాలు.. ప్రత్యేక ప్యాకేజీలు - కామారెడ్డి కూరగాయల మార్కెట్

ప్రజల వద్దకు నిత్యవసర సరుకులు అందించాలన్న ఉద్దేశంతో సంచార వాహనాలను ఏర్పాటు చేశామని ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ అన్నారు. తక్కువ ధరలకే ఇళ్లవద్దకే వచ్చి సరుకులు ఇస్తారని పేర్కొన్నారు.

Vegetables at home Special packages available in kamareddy
ఇంటి వద్దకే కూరగాయాలు.. ప్రత్యేక ప్యాకేజీలు

By

Published : Apr 4, 2020, 7:27 PM IST

కామారెడ్డి జిల్లా కేంద్రంలోని కూరగాయల మార్కెట్ వద్ద మార్కెట్​లోకి వచ్చే వారికి వైరస్ సోకకుండా సోడియం హైపో క్లోరైట్​ ద్రావణం పిచికారి విధానాన్ని ఏర్పాటు చేశారు. దానిని, సంచార రైతు బజార్, కిరాణా వస్తువుల వాహనాలను ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ జెండా ఊపి ప్రారంభించారు.

ప్రజలు నిత్యావసర సరుకుల కొనుగోలుకు ఇబ్బందులు పడకుండా గ్రామాల వారీగా సంచార వాహనాలను ఏర్పాటు చేశామన్నారు. రూ. 500, రూ. 1000ల ప్యాకేజీలను ప్రత్యేకంగా ఉంచామన్నారు. కరోనా వైరస్ కట్టడి కోసం జిల్లా యంత్రాంగం అప్రమత్తంగా ఉందని కలెక్టర్​ అన్నారు. ప్రజలు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ శ్వేతారెడ్డి, అదనపు కలెక్టర్ యాదిరెడ్డి, వెంకటేష్ దొత్రే, మున్సిపల్ ఛైర్​పర్సన్ జాహ్నవి, ఆర్డీఓ రాజేంద్రకుమార్, తదితరులు పాల్గొన్నారు.

ఇంటి వద్దకే కూరగాయాలు.. ప్రత్యేక ప్యాకేజీలు

ఇదీ చూడండి :మాయదారి మనిషిని నేను అంటున్న ఎస్పీ బాలు

ABOUT THE AUTHOR

...view details