చదువుల తల్లి సన్నిధిలో చిన్నారులకు అక్షరాభ్యాసం - vasantha panchami in telangana
వసంత పంచమి సందర్భంగా కామారెడ్డి జిల్లాలోని ఆలయాలన్ని భక్తులతో కిటకిటలాడాయి. సరస్వతీ అమ్మవారికి అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు.
చదువుల తల్లి సన్నిధిలో చిన్నారులకు అక్షరాభ్యాసం
కామారెడ్డి జిల్లాలోని ఆలయాలన్నీ భక్తులతో సందడిగా మారాయి. ప్రస్తుతం కరోనా వ్యాప్తి తగ్గడం.. ఆలయాలు తెరిచే ఉండటం వల్ల అక్షరాభ్యాస కోసం చిన్నారులతో తల్లిదండ్రులు తరలొచ్చారు. ఇల్చిపూర్ గ్రామ శివారులో కొలువుదీరిన చదువుల తల్లిని పెద్ద ఎత్తున భక్తులు దర్శించుకున్నారు. సరస్వతీ అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసి చిన్నారులకు అక్షరాభ్యాసం చేయించారు. తమ పిల్లలు విద్యావంతులు కావాలని తల్లిదండ్రులు అమ్మవారిని ప్రార్థించారు.
- ఇదీ చూడండి :జోగులాంబ ఆలయంలో కేసీఆర్ కుటుంబం..