కామారెడ్డి జిల్లా కేంద్రంలోని శాంతి థియేటర్లో... కొందరు అభిమానులు వీరంగం సృష్టించారు. పట్టణానికి చెందిన సుమారు 50 మంది యువకులు ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. మద్యం మత్తులో థియేటర్ ప్రొజెక్టర్‌పై వాటర్ బాటిళ్లు విసిరారు. హాల్లోని సీట్లు చింపివేసారు. అరగంటపాటు యువకుల గొడవతో వకీల్‌సాబ్ సినిమాను యజమానులు నిలిపివేశారు.
థియేటర్లో అభిమానుల వీరంగం... - అభిమానుల వీరంగం
అభిమానుల మధ్య చిన్నగా మొదలైన వివాదం... థియేటర్లో ఇరువర్గాల మధ్య ఘర్షణకు తెరతీసింది. థియేటర్ తెరనే ధ్వసం చేసేంత స్థాయికి దాడి పెరిగిపోయింది. ఈ ఘటన కామారెడ్డిలోని శాంతి థియేటర్లో జరగ్గా... వకీల్‌సాబ్ షో ను నిలిపివేశారు.
థియేటర్లో అభిమానుల వీరంగం... వకీల్‌సాబ్ షో నిలిపివేత
విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని పరిస్థితిని సమీక్షించారు. యువకులను పోలీసులు సముదాయించారు. అయితే... చిరంజీవి, పవన్‌కల్యాణ్ ఫ్యాన్స్ మధ్య గొడవ జరిగినట్లు పట్టణంలో ప్రచారం జరుగుతుంది. సెకండ్ షో సినిమా సమయంలో ఈ ఘటన జరిగింది.