కామారెడ్డి జిల్లాలో ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన పెయింటర్ ఉమేష్ విద్యుదాఘాతంతో మరణించాడు. జిల్లా కేంద్రంలోని రామారెడ్డి కూడలిలో ఓ ఇంటికి రంగులు వేస్తుండగా విద్యుత్ తీగలు తగలి కింద పడిపోయాడు. తీవ్ర అస్వస్థతకు గురైన ఉమేష్‌ను జిల్లా కేంద్ర ఆస్పత్రికి స్థానికులు తరలించారు. చికిత్స పొందుతూ మృతి చెందాడు. రంగుల వేస్తున్న సమయంలో విద్యుత్ సరఫరా నిలిపివేసేందుకు అనుమతి తీసుకోకపోవడమే ఉమేష్ మృతికి కారణమని స్థానికులు ఆరోపిస్తున్నారు. మృతిడి కుటుంబానికి ఆర్థిక సాయం చేయాలని కోరారు.
విద్యుదాఘాతంతో ఉత్తర్‌ప్రదేశ్‌వాసి మృతి - young man died with electric shock
కామారెడ్డి జిల్లా కేంద్రంలో విద్యాదాఘాతంతో ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన ఉమేష్ మరణించాడు. రామారెడ్డి కూడలిలో ఓ ఇంటికి రంగులు వేస్తుండగా విద్యుత్ తీగలు తగిలి మృత్యవాత పడ్డాడు.
విద్యుదాఘాతంతో ఉత్తర్‌ప్రదేశ్‌వాసి మృతి