తెలంగాణ

telangana

ETV Bharat / state

వివాహేతర బంధం ఎంత పని చేసింది..! - ఇద్దరు మృతి

వాళ్లిద్దరికి పెళ్లి అయ్యింది. పిల్లలూ ఉన్నారు.. వివాహేతర బంధం పెట్టుకున్నారు. వీరి గురించి ఇంట్లో తెలిసిందనే అవమానంతో ఇద్దరు ఉరి వేసుకుని తనువులు చాలించారు ఇరు కుటుంబాల్లో విషాదాన్ని నింపారు.

two-persons-committed-suicide-with-illegal-affair-in-kamareddy
వివాహేతర బంధం ఎంత పని చేసింది..!

By

Published : May 16, 2020, 9:30 AM IST

Updated : May 16, 2020, 11:47 AM IST

కామారెడ్డి జిల్లా మాచిరెడ్డి శివారులో విషాదం చోటు చేసుకుంది. వివాహేతర సంబంధంతో ఇద్దరు ఆత్మహత్యకు పాల్పడి వారి కుటుంబాలలో విషాదం నింపారు. మాచిరెడ్డికి చెందిన నర్సింహులుకు పెళ్లి అయ్యింది. ఇద్దరు కుమారులు ఉన్నారు. మరో మహిళకు భర్త, కుమారుడు ఉన్నారు. ఈ ఇద్దరి మధ్య వివాహేతర సంబంధం ఏర్పడింది.

ఇరు కుటుంబాల్లో తెలిసిపోయిందనే అనుమానంతో ఇద్దరూ ఆత్మహత్యకు పాల్పడ్డారు. చెట్టుకు ఉరి వేసుకున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

ఇవీ చూడండి:డెంగీ తొంగి చూస్తోంది..

Last Updated : May 16, 2020, 11:47 AM IST

ABOUT THE AUTHOR

...view details