కామారెడ్డి జిల్లా కేంద్రంలో ఆర్టీసీ కార్మికులు ఎమ్మెల్యే గంప గోవర్ధన్ ఇంటి ముట్టడికి యత్నించారు. అప్పటికే ఎమ్మెల్యే ఇంటి వద్ద పోలీసులు బారికేడ్లతో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. కార్మికులు ఇంటి సమీపంలోని రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేపట్టారు. మహిళా కార్మికులు బతుకమ్మ ఆడుతూ తమ నిరసన తెలిపారు.
38 రోజులుగా సమ్మె చేస్తున్నా.. ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోందన్నారు. కార్మికులతో చర్చలు జరపాలని కోర్టు సూచించినా.. ముఖ్యమంత్రి పెడచెవిన పెడుతున్నారని ఆరోపించారు. ప్రభుత్వం స్పందించి వెంటనే చర్చలకు పిలవాలని డిమాండ్ చేశారు.
ఎమ్మెల్యే గంప గోవర్ధన్ ఇంటి ముట్టడికి యత్నం - కామారెడ్డి ఎమ్మెల్యే గంప గోవర్ధన్ ఇంటి ముట్టడికి ఆర్టీసీ కార్మికుల యత్నం
ఐకాస పిలుపు మేరకు కార్మికులు కామారెడ్డి ఎమ్మెల్యే గంప గోవర్ధన్ ఇంటి ముట్టడికి యత్నించారు. అప్పటికే పోలీసులు అక్కడ భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
ఎమ్మెల్యే గంప గోవర్ధన్ ఇంటి ముట్టడికి యత్నం
ఇవీ చూడండి: ఆర్టీసీ సమ్మె పై హైకోర్టులో కొనసాగుతున్న విచారణ