కామారెడ్డి జిల్లా కేంద్రంలో ఆర్టీసీ కార్మికులు చేస్తున్న సమ్మె 33వ రోజుకు చేరుకుంది. పట్టణంలోని బస్టాండ్ ఎదుట కార్మికులు బైఠాయించి ధర్నాకి దిగారు. వేకువజాము నుంచే డిపో వద్ద ఆందోళన చేస్తున్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ... డిపోలికి చొచ్చుకుపోయే ప్రయత్నం చేశారు. రంగప్రవేశం చేసిన పోలీసులు నిరసనకారులను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కి తరలించారు. తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించే వరకు సమ్మెను ఆపేదని లేదని కార్మికులు హెచ్చరించారు.
కామారెడ్డిలో 33వ రోజూ కొనసాగుతున్న ఆర్టీసీ సమ్మె - TSRTC WORKERS STRIKE
కామారెడ్డి జిల్లా కేంద్రంలో ఆర్టీసీ కార్మికులు ఆందోళన చేశారు. డిపో ముట్టడికి యత్నించిన కార్మికులను పోలీసులు అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కి తరలించారు.
![కామారెడ్డిలో 33వ రోజూ కొనసాగుతున్న ఆర్టీసీ సమ్మె](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-4977994-637-4977994-1573033829761.jpg)
కామారెడ్డిలో 33వ రోజూ కొనసాగుతున్న ఆర్టీసీ సమ్మె
కామారెడ్డిలో 33వ రోజూ కొనసాగుతున్న ఆర్టీసీ సమ్మె
TAGGED:
TSRTC WORKERS STRIKE