బస్సులు నడుపుతున్న ప్రైవేటు డ్రైవర్లు, కండక్టర్లు - tsrtc bus strike today
రాష్ట్రవ్యాప్తంగా ఆర్టీసీ సమ్మె కొనసాగుతోంది. ప్రైవేటు వ్యక్తులతో బందోబస్తుల నడుమ బస్సులను నడిపించేందుకు పోలీసులు, అధికారులు ప్రయత్నిస్తున్నారు.
కామారెడ్డి జిల్లాలోని బస్టాండు ప్రాంగణంలో బస్సులు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. ఆర్టీసీ కార్మికులు సమ్మెతో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. పోలీస్ బందోబస్తు నడుమ... ప్రైవేట్ వాహనాలను తెచ్చి ప్రైవేట్ వ్యక్తులతో బస్సులు నడుపుతున్నారు. ప్రైవేటు వాహనాలు టికెట్‌పైన అధనంగా వంద రూపాయలు జమ చేస్తున్నారు. కామారెడ్డి జిల్లా బస్ ప్రాంగణంలో 123 బస్సులకు కేవలం 13 బస్సులు మాత్రమే ఉదయం నుంచి నడుస్తున్నాయి. ప్రభుత్వం దిగిరాకపోతే సమ్మె ఇంకా రెండు రోజుల్లో అధికం చేస్తామని హెచ్చరించారు.