కామారెడ్డి జిల్లా కేంద్రంలో ఆర్టీసీ కార్మికులు 19వ రోజు తమ నిరసనను తెలియజేశారు. జేఏసీ శిబిరం నుంచి ర్యాలీ నిర్వహించారు. అనంతరం ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ ఇంటిని ముట్టడించి ధర్నాకు దిగారు. ప్రభుత్వం తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని, ఆర్టీసీని ప్రవేట్ పరం చేయకుండా ప్రభుత్వంలో విలీనం చేయాలని డిమాండ్ చేశారు. సుమారు గంట పాటు ఇంటి ముందు ధర్నా కార్యక్రమం చేపట్టారు. ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ లేకపోవడం వల్ల సిబ్బందికి కార్మికులు వినతి పత్రం సమర్పించారు.
విప్ గంప గోవర్ధన్ ఇంటిని ముట్టడించిన కార్మికులు - gampa govardhan
సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ కామారెడ్డి జిల్లా కేంద్రంలో ఆర్టీసీ కార్మికులు ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ ఇల్లు ముట్టడించారు.
ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ ఇంటిని ముట్టడించిన కార్మికులు